Upcoming

Events

ప్రవచనామృతంతో ప్లవ నామ సంవత్సరానికి స్వాగతం.🥭🌿🌸🎋

"శ్రీ సాంస్కృతిక కళాసారథి"సింగపూర్, ఆధ్వర్యంలో అంతర్జాలం ద్వారా.. ప్రపంచ ప్రఖ్యాత కవి, గ్రంధకర్త, ఆధ్యాత్మిక ప్రవచనకారులు, ఋషి పీఠం సంస్థాపకులు, గురువర్యులు పూజ్య బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి ప్రవచన కార్యక్రమము మరియు సింగపూర్ గాయనీగాయకులచే "శివపదం" భక్తి గీతాలాపన

🌺 "ఉగాది విశిష్టత - ధర్మాచరణము"🌺

తేదీ: 11/04/2021 ఆదివారం
సమయం: 6:00 pm (సింగపూర్ కాలమానం)
వేదిక అంతర్జాలం

ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని తామెల్లరూ తిలకించి తెలుగు సారస్వత వైభవ కల్పవృక్షముక్రింద, వేయిపడగల నీడలో సేద తీరగలరని ఆశిస్తున్నాము.

ఈ కార్యక్రమం ఆసాంతం యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడును


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించి భగవదనుగ్రహాన్ని, గురువుగారి ఆశీస్సులను పొందగలరని ఆశిస్తూ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాము 🙏

కృతజ్ఞతలతో🙏
నిర్వాహక వర్గ సభ్యులు.
"శ్రీ సాంస్కృతిక కళాసారథి" సింగపూర్

About Sri Samskrutika Kalasaradhi

Objectives

ఆనేక సంస్కృతులను తనలో ఇముడ్చుకుని వన్నెల కలల ప్రపంచంగా భాసిల్లే సింగపూర్ లో భారతీయ సంస్కృతికి కళలకు అద్దం పట్టే విధంగా, మన సంగీతం సాహిత్యం నాట్యం చిత్రలేఖనం నాటకం జానపదం ఆధ్యాత్మిక తదితర కార్యక్రమాలకు చక్కటి వేదికను ఏర్పాటుచేయాలనే తపనతో "శ్రీ సాంస్కృతిక కళాసారధి" బృందం ప్రారంభించాము.






Read More

Participate With Us

సింగపూర్ నుండి తొలిసారి అంతర్జాలం ద్వారా "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సంస్థ వారిచే 5 జూలై 2020, తేదీన నిర్వహింపబడుతున్న "అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనం" ఫేస్బుక్ (ఈ పేజీ ద్వారా) & యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం వీక్షించుటకు సాహితీ మిత్రులందరికీ సాదర ఆహ్వానం💐 (Kindly note that registrations for participants are closed) మీ అందరి ఆశీస్సులతో సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జయప్రదం కాగలదని

ఆకాంక్షిస్తూ ధన్యవాదాలతో 🙏

నిర్వాహక బృందం, శ్రీ సాంస్కృతిక కళాసారథి

Read More