Objectives

Objectives

ఆనేక సంస్కృతులను తనలో ఇముడ్చుకుని వన్నెల కలల ప్రపంచంగా భాసిల్లే సింగపూర్ లో భారతీయ సంస్కృతికి కళలకు అద్దం పట్టే విధంగా, మన సంగీతం సాహిత్యం నాట్యం చిత్రలేఖనం నాటకం జానపదం ఆధ్యాత్మిక తదితర కార్యక్రమాలకు చక్కటి వేదికను ఏర్పాటుచేయాలనే తపనతో "శ్రీ సాంస్కృతిక కళాసారధి" బృందం ప్రారంభించాము.


మా ఆశయాలు:

🔴  వివిధ సాంస్కృతిక మరియు కళారంగాల్లో సింగపూర్ వాస్తవ్యులైన భారతీయుల, ముఖ్యంగా తెలుగువారి ప్రతిభను వెలికి తెచ్చి గుర్తింపునిచ్చేవిధమైన వేదికలు ఏర్పాటు చేయుట


🔴  అంతరించిపోతున్న కళలకు ప్రోత్సాహాన్ని అందించుట.


🔴  వర్ధమాన మరియు యువ కళాకారులను, రచయితలను ప్రోత్సహించుట.


🔴  ఈ తరం యువతీయువకులకు భారతీయ సంస్కృతి సనాతన ధర్మం పట్ల ఆసక్తి పెరిగేలా కార్యక్రమాలు రూపొందించుట.


🔴  వివిధ కళా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాలలో లబ్ధప్రతిష్ఠులైన పెద్దల ద్వారా స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలను ఏర్పాటు చేయుట. మీ అందరి సహాయ సహకారాలను, ఆశీస్సులను కోరుతూ ..



ధన్యవాదాలతో 🙏
'శ్రీ సాంస్కృతిక కళాసారధి' నిర్వాహకులు