ఆపాత మధురాలయిన చిత్రరాజాల ప్రేమికులకు, సినీ ప్రముఖులకు, తెలుగు చలనచిత్ర అభిమానులందరికీ సాదర ఆహ్వానం
"వంశీ ఇంటర్నేషనల్", హైదరాబాద్ మరియు "శ్రీ సాంస్కృతిక కళాసారథి", సింగపూర్ వారి సంయుక్త నిర్వహణలో డాక్టర్ భానుమతి రామకృష్ణ గారి 96వ జయంతి సందర్భంగా, కళాభారతి, అలనాటి అందాలనటి శ్రీమతి జమున రమణారావు గారికి భానుమతీ రామకృష్ణ పురస్కారప్రదానం కార్యక్రమం చేయుచున్నామని తెలియజేయుస్తూ, మా ఈ కార్యక్రమాన్ని వీక్షించి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. 💐
తేదీ: 07/09/2020సమయం: సాయంత్రం 4:00గంటల (IST) నుండి..
వేదిక అంతర్జాలం
ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని తామెల్లరూ తిలకించి తెలుగు సారస్వత వైభవ కల్పవృక్షముక్రింద, వేయిపడగల నీడలో సేద తీరగలరని ఆశిస్తున్నాము.
ఈ కార్యక్రమం ఆసాంతం యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడును
కృతజ్ఞతలతో🙏
నిర్వాహక వర్గ సభ్యులు.
"శ్రీ సాంస్కృతిక కళాసారథి" సింగపూర్
సాహితీవేత్తల వేదిక సాహితీజగతికే వేడుక📖🖋️🙏
తెలుగు సాహితీదీప్తిని దిగంతాలకు చాటిన కవిసమ్రాట్ పూజ్య విశ్వనాథ సత్యనారాయణ గారి 125వ జయంతి వేడుకలు కార్యక్రమములో, మా "శ్రీ సాంస్కృతిక కళాసారథి" నిర్వహణాబాధ్యతను పంచుకోవడం, మా భాగ్యంగా, మాకు దక్కిన గౌరవంగా భావిస్తూ తామెల్లరికి సవినయంగా ఆహ్వానం పలుకుతున్నాము.
తేదీ: 10 సెప్టెంబర్ 2020సమయం ఉదయం 9:00 గంటలకు, (భారత కాలమానం)
వేదిక అంతర్జాలం
ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని తామెల్లరూ తిలకించి తెలుగు సారస్వత వైభవ కల్పవృక్షముక్రింద, వేయిపడగల నీడలో సేద తీరగలరని ఆశిస్తున్నాము.
ఈ కార్యక్రమం ఆసాంతం యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడును
కృతజ్ఞతలతో🙏
నిర్వాహక వర్గ సభ్యులు.
"శ్రీ సాంస్కృతిక కళాసారథి" సింగపూర్